TRINETHRAM NEWS

Trinethram News : AP : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తనను ఈసారి మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారని, తనపై ప్రజలకు నమ్మకం ఉందని నారా లోకేష్ తెలిపారు. కాగా ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది.