ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వానిదే విజయం
ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్న ఎమ్మెల్యే గోరంట్ల, జవహర్…
తన విజయానికి అందరి సహకారం కావాలన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్…
ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వాన్ని విజయమని ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ తెదేపా కార్యాలయం నందు మాజీ మంత్రివర్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కే.జవహర్, జిల్లా పరిశీలకులు మందలపు రవికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరిగే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 8365 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలని బూత్ కన్వీనర్లకు పలు సూచనలు చేశారు.
అలాగే ప్రతి బూత్ నందు కన్వీనర్ తో పాటుగా ఓటర్ల సంఖ్యను బట్టి సాధికార సభ్యులుగా మరి కొంతమందిని ఎంచుకొని రేపటినుండి పని ప్రారంభించాలని తెలిపారు. జిల్లా తెదేపా అధ్యక్షులు కె.ఎస్.జవహర్, పరిశీలకులు మందలపు రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అనేక రంగాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి గురించి ఓటర్లకు తెలియజేయాలని కోరారు. అలాగే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కడియం మండలం తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, మార్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వరగోగుల వెంకటేశ్వరరావు, పిల్ల తనుజ, మద్ద మణి, ముత్తబత్తుల విజయ, దండమూడి ప్రమీల, సీలం గోవిందు, రొంపిచర్ల ఆంటోనీ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, దాలిపర్తి వేమన, వడ్డీ వరప్రసాద్, పల్లి సాయి, మట్ట శ్రీను, ధార అన్నవరం, గుత్తుల కృష్ణ, మన్యం నాగేంద్ర, చలమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, ఎంఎంఎల్ రాజు, ఉండవెల్లి బంగార్రాజు, తాడేపల్లి నాగరాజు, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, ఆళ్ల ఆనందరావు, పిన్నింటి ఏకబాబు తదితరులు…
జనసేన నాయకులు చాప్పా చిన్నారావు, నారాయణ గౌడ్, ముద్రగడ జెమ్మి, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, సోము వినాయక్, ఆదిమూలం సాయిబాబా, షేక్ అమీనా బేగం తదితరులు…
బిజెపి నాయకులు ఆకుల శ్రీధర్, బొరుసు సుబ్రమణ్యం, సింగవరపు రామకృష్ణ, యానాపు యేసు, శివ, షేక్ షాజిద్, మట్ట నాగబాబు తదితరులు…
ఐటిడిపి సభ్యులు కోరడ వెంకటేష్, ఎమ్మెస్సార్ శ్రీను, రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App