TRINETHRAM NEWS

తేదీ : 01/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు అంటూ వాపోయారు.

ఇలాంటి వేధింపులు తమకేమీ కొత్త కాదని, ఎన్ని వేధింపులకు గురిచేసిన వైసిపి అధినేత
మాజీ సీఎం జగన్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసిపి నేతలను అరెస్టు చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

No fear of cases