TRINETHRAM NEWS
Niti Aayog's sensational announcement on Land Titling Act

Trinethram News : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ.. ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతు..

ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబు ఇచ్చింది నీతి ఆయోగ్. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని క్లారిటీ ఇచ్చింది.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింతగా సులువు అవుతుందని తెలిపింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ ప్రకటించింది.

ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని తేల్చి చెప్పింది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఆర్టీఐ ద్వారా వెంకటేశ్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించింది.

ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని, భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని, భూములపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.

అయితే, ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉంది? నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం వ్యహరిస్తోందా? అన్న అంశానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు అంటూ ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ వేశారు.

ఈ చట్టంతో రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పాలని నీతి ఆయోగ్ ను అడిగారు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్.. కచ్చితంగా వారి భూ హక్కులు మరింత భద్రంగా ఉంటాయన్న సమాధానాన్ని నీతి ఆయోగ్ ఇచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Niti Aayog's sensational announcement on Land Titling Act