TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్లో బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటి కానున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటియుసి అనుబంధం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ క్వార్టర్స్ దగ్గరికి ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటలకు చేరుకోవాలన్నారు.జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరు ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున రాగలరని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.కావున ఉద్యోగులు బారీగా తరలివచ్చి బేటిని విజయవంతం చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇవ్వనున్న వినతి పత్రం
విషయం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న 17541 మంది వివిద సమస్యలు పరిష్కారం,510 జి.ఓ.లో నష్టం జరిగిన 4000 వేల ఉద్యోగులకు న్యాయం చేయాలని తమరితో విన్నవించుకుంటున్నాము ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల డిమాండ్లు
1ఎన్హెచ్ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి రేగ్యులర్ ఉద్యోగుల యొక్క బేసిక్ పే వేతనాలు చెల్లించగలరు.
2.ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేయాలి
3.2018 నుండి ప్రసుత్తం 2025 వరకు అల్ ఎన్ హెచ్ ఎం క్యాడర్ ఉద్యోగులందరికి 510 జి.ఓ. లో నష్టం జరిగిన వారికి కొత్త జి.ఓ. విడుదల చేసి వేతనాల వేంటనే పెంపు చేసి జి.ఓ. విడుదల చేయాలని కోరుచున్నాము
4.గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం 2018 లో పి.ఆర్.సి. విడుదల చేసారు. దానికి సంబంధించిన ఏరియర్స్ 7 నెలల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
5.బస్తీ దవాఖానలో 2018/2019 సంవత్సరాలలో కాంట్రాక్ట్ విదానంలో నియమకమైన సపోర్టింగ్ స్టాఫ్ ను ఏజన్సీలకు అప్పజెప్పడాన్ని నిలుపుదల చేయాలి తిరిగి ఇట్టి సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ విదానంలో కోనసాగించాలి
6.రోజు వారి కూలి కంటే తక్కువ జీతంతో పనిచేస్తున్న ఉద్యోగులందరికి వారి క్యాడర్స్కి తగ్గట్టుగా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకోని మానవతా దృక్పదంతో వేతన సవరణ చేయగలరు.

7.ఎం ఎల్ హెచ్ పి పేరును ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మెడికల్ ఆఫీసర్గా మార్పు చేయగలరు.

8.ఎన్ హెచ్ ఎం మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.

9.ఎన్ హెచ్ ఎం ఉద్యోగి వీది నిర్వహణలో మరణిస్తే వారి ఇంట్లో ఒకరికి 6 నెలల లోపు కారుణ్య నియమకం చేయాలి

10ఎన్ హెచ్ ఎం పథకంలో సంవత్సరానికి 35 సాధారణ సెలవులు ఉద్యోగులందరికి మంజూరు చేయాలి 11హర్యాణా,ఓడిషా,జార్ఖండ్,హిమాచల్ ప్రదేశ్,మధ్యప్రదేశ్,మణిపూర్ మరియు మహారాష్ట్ర ఆయా రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేశారు. కావున తెలంగాణ రాష్ట్రంలో కూడ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేయాలని కోరుచున్నాము. అప్పటి వరకు ఉద్యోగులకు 100 గ్రాస్ సాలరీ మంజూరు చేయాలని కోరుచున్నాము.పైన పేర్కోన్న అన్ని క్యాడర్లతో ఎన్ హెచ్ ఎం స్కీంలో అతి తక్కువ జీతంతో పని చేస్తున్నారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్.సి. ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ + డి.ఎ. + హెచ్.ఆర్.ఎ. చెల్లించాలని ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తమని కోరుచున్నాము

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NHM employees to meet