
సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. (28.3.2025).
కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద డిమాండ్ ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ గత నవంబర్ లో మంత్రి నారాయణ పేర్కొన్న విధంగా సిఎం ఆదేశాల మేరకు రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో వున్న విలీన గ్రామాల కోర్టు వ్యాజ్యాలు పరిష్కరించే ఫైల్ ధర్మాసనం ముందుంచు తున్నామని తెలిపిన కార్యాచరణ బహిర్గతం చేయాలన్నారు.
నగరానికి మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్నారు. పంచాయతీ చట్టం నుండి వేరు చేసిన తూరంగి ఇంద్రపాలెం వలసపాకల వాకలపూడి చీడిగ రమణయ్య పేట స్వామి నగరం టీచర్స్ కాలనీ ప్రాంతాలకు 14ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతుల తో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గడువు పొడిగించి విలీన గ్రామాలతో కార్పోరేషన్ ఎన్నికలు పూర్తి చేయించి ప్రాజెక్ట్ మొదటి దశలో అవకాశం ఇచ్చిన రూ 10వేల కోట్ల రూపాయ ల అభివృద్ధి పనులకు అవకాశం కల్పించా లన్నారు. మంత్రికి కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.
ఫోటో కలెక్టరేట్ కాకినాడ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
