TRINETHRAM NEWS

MRPS MSP మరియు అనుబంధ సంఘాల

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లోతుకుంట ( మేడ్చల్ జిల్లా)
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 3 న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ” వెయ్యి గొంతులు లక్ష డప్పులు ” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికై MRPS MSP మరియు అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం మేడ్చల్ జిల్లా పరిధిలోని అల్వాల్ మండలం లోతుకుంటలోని శుభ గార్డెన్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS అధినేత మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మాదిగ కళామండలి జాతీయ అధ్యక్షులు నై అశోక్ మాదిగ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమం MRPS మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్ మాదిగ ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభమైంది..

ఈ సమావేశాన్ని MSP మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కేశపగా రామచందర్ మాదిగ సమన్వయం చేశారు.

నెల రోజుల వ్యవధిలో నిర్వహించబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి,అలాగే లక్షల డప్పుల సమీకరణ ఎలా చేయాలి , కళానేతల కార్యాచరణ ఏ విధంగా అమలు చేయాలనే అంశం ఎజెండాగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో కళానేతలు ఏపురీ సోమన్న, మచ్చ దేవేందర్,పాటమ్మ రాంబాబు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App