
తేదీ : 21/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని). మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని , వైజాగ్ స్టేడియం పేరు మార్చలేదని , 30 ఏళ్లుగా ఏ పేరు ఉందో ఆ పేరు తొలగించలేదని, అమరావతి స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఉందని స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ అదేవిధంగా విజయనగరం జిల్లా మూలపాడు లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, అభివృద్ధికి బిసిసిఐ సహకారం లభిస్తుందని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో సంవత్సరానికి 30 గ్రౌండ్స్ చొప్పున అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పేర్కొన్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రుల లోకేష్, కారణంగా తాను ఎ సి ఎ అయినట్లు తెలిపారు. గతంలో వైజాగ్ స్టేడియంలో రెండు ఐసిఎల్ మ్యాచ్ లు జరిగాయి అన్నారు. ఈసారి కూడా మ్యాచ్ లు నిర్వహించాలని ఢిల్లీ కెప్టెన్సును అడిగాము అని తెలిపారు. స్టేడియం నిర్వహణ సదుపాయాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేష్ జి.ఎం.ఆర్ యాజమాన్యంతో మాట్లాడగా స్టేడియం ఆధునికరిస్తే మ్యాచ్ ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారని, తెలిపారు. స్టేడియంలో 34 గదులతో పాటు ,హైజినిక్ గా ఉండే 320 టాయిలెట్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో స్టేడియంలో 53 టాయిలెట్స్ మాత్రమే ఉండేవి అని పేర్కొన్నారు. స్టేడియం మొత్తం ఎల్ఈడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రెస్ గ్యాలరీలు ఆధునికరించినట్లు చెప్పారు.
ఢిల్లీ కెప్టెన్స్ బృందం పనులన్నీ చూసి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు ఇండియాలోనే ది బెస్ట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ప్రశంసించారని తెలపడం జరిగిందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచేలా వైజాగ్ క్రికెట్ స్టేడియం ఉందన్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన 800 మంది రాత్రి పగలు కష్టపడడం వల్ల అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో రెండు నెలల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. యే స్టేడియంనిర్మించాలన్న బి సి సి ఐ అనుమతి తీసుకోవాలి అన్నారు.
స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఏపీకి నేషనల్ గేమ్స్ తో పాటు అన్ని క్రీడలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యన్ టి ఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా . సంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర నాయకులు మాది గాని .గురునాథం సీనియర్ నాయకులు నరసింహ చౌదరి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
