TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద బుధవారం ఉదయం స్నానానికి దిగి, గల్లంతైన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మృతులు అనిశెట్టి పవన్ (19), టి. పవన్ (17), జి ఆకాష్ (19), పి. దుర్గాప్రసాద్ (19), పి. సాయి కృష్ణ (19 ) కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తో ఎంపీ పురందేశ్వరి ఫోన్ లో ఆరా తీశారు. రేవుల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి స్నానాలకు దిగకుండా చూడాలని ఆమె సూచించారు.

ఈ ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఎంపీ పురందేశ్వరి సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ ఘటన విషయాన్నీ తీసుకెళ్లి మృతుల కుటుంబాలకు సహాయం అందేలా చూస్తానని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP Purandeshwari deeply disturbed