
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 14: నెల్లూరు జిల్లా. కావలి శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి , రెండు రోజుల క్రితం అల్లూరు మండలం నార్త్ ఆమలూరు లో శరత్చంద్ర ఒక చిన్న చిరు ఉద్యోగి ఒక పాఠశాల ఆశ్రమం పెట్టి తల్లి తండ్రి లేని అనాధ బాల బాలికలను చదివిస్తూ వారికి ఉద్యోగం వచ్చేంతవరకు కృషి చేస్తూ ఆ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేంతవరకు కృషి చేస్తూ సుమారు 250 మంది అక్కున చేర్చుకున్న మహనీయుడు శరత్చంద్ర.
ఆయన చేసిన కృషిని సేవను తెలుసుకున్న , కావలి , ప్రియతమా శాసనసభ్యులు ,కావ్య కృష్ణారెడ్డి , భావోద్వేగానికి గురి అయి ఒక సమయంలో కళ్ళు చెమర్చుకుని సేవను కొనియాడుతూ తన హోదాను మరిచి శరత్ చంద్ర శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించడం అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది అందుకే ఆయన ఎప్పుడూ చెబుతాడు నేను నాయకుడిని కాదు, సేవకుడిని ,అని అందుకే, చేతులు జోడించి జేజేలు పలుకుతున్నారు ..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
