TRINETHRAM NEWS

పత్రికా మరియు మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్.కే
గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయలేదని

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బి.ఆర్.ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని విమర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మతిస్థిమితం లేకుండా పోయిందని విమర్శించారు. రైతు రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇవ్వలేదని కేటీఆర్ పిలుపు ఇవ్వడంతో, ఆయన తాబేదారులు అక్కడక్కడ ధర్నాలు చేశారని అన్నారు. ధర్నాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని, గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రైతు రుణమాఫీ చేస్తామని, మోసం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని, 7 విడతల వారీగా చేయడంతో, చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో, 2019లో రుణమాఫీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ప్రభుత్వం 2021 వరకు రుణమాఫీ ఊసే ఎత్తలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల చేసిన రుణమాఫీ 50 శాతానికి మించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 70 శాతం పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. బిఆర్ఎస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గతంలో వారి ప్రభుత్వ హయంలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలకు 10 నుండి 20 కిలోల వడ్ల కటింగ్ చేసిన బిఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి, మోసం చేసి, పారిపోయే పార్టీ కాదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసాను అందిస్తామని, సన్న వడ్లకు ఈ సీజన్ నుండే ₹ 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడంలో ఆ పార్టీకి గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డు ఇవ్వచ్చని అన్నారు
ఈ పత్రికా సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App