గుడివాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Trinethram News : డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి గుడివాడ రావడం సంతోషకరం…
మల్లయ్యపాలెం వాటర్ వర్క్స్ వద్ద సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాము పర్యటన.
పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.
పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు మీడియాకు తెలిపిన ఎమ్మెల్యే రాము
పెనమలూరు నియోజకవర్గంలో పర్యటన పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కళ్యాణ్ మల్లయ్యపాలెం చేరుకుంటారు.
గ్రామంలోని వాటర్ వర్క్స్ వద్ద మరమ్మత్తులు పూర్తయిన ఫిల్టర్ బెడ్లు మరియు నీటి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు.
పవన్ కళ్యాణ్ సహకారంతో.. నియోజకవర్గంలోని 43 గ్రామాల్లో..రూ.3.27 కోట్లతో ఫిల్టర్ బేడ్లకు మరమ్మత్తులు చేశాం.
మరమ్మత్తుల అనంతరం 43 గ్రామాల్లో త్రాగునీటి నాణ్యతను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ తిలకిస్తారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు పర్యటన పూర్తి చేసుకొని పవన్ తిరిగి వెళతారు.
గుడివాడ మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, గుడివాడ ఎండిఓ విష్ణు ప్రసాద్, పలువురు అధికారులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాముతో కలిసి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App