డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కాటిక బండ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగ్యా నాయక్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకొని బుధవారం నాడు దేవరకొండ శాసనసభ్యులు నేనావాత్ బాలు నాయక్ జంగ్య నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.
ఈ సందర్భంలో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పర్తి రవి కుమార్ రెడ్డి, డిండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App