TRINETHRAM NEWS

బాబు…
600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా?

-ఎమ్మెల్యే బొల్లా ప్రశ్న

వినుకొండని మోడల్ “సిటి”గా అభివృద్ధి చేస్తా

ఇందిరానగర్ ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ పట్టణంలోని ఇందిరా నగర్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడని అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు.

అధికారం కోసం అడ్డదారు తొక్కడం చంద్రబాబునాయుడు కి కొత్త ఏమీ కాదని, ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

అయితే…అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనిఆడారు.

చంద్రబాబు నాయుడు సైకిల్ ని బ్రతికించుకునేందుకు కనబడ్డ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి చేతిలో మరోసారి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. లోపాయి కాలికంగా కాంగ్రెస్తో, ప్రత్యక్షంగా బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎద్దేవ చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిన జగన్మోహన్ రెడ్డిగారిని ప్రజలు మర్చిపోరు అన్నారు.

రానున్న ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యేగా మరో మారు గెలిపిస్తే వినుకొండ పట్టణాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించింది ఎవరో గుర్తుచేసుకోవాలని, ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసేది ఎవరో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నా జీవి ఆంజనేయులకు ప్రజలు మరో మారు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పేదలు బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత నిచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలో.. ధరలు పెత్తందారుల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకొని సమయం వచ్చిందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చంద్రబాబు నాయుడు అధికారంలోకొస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని స్పష్టం చేశారు. విద్యా వైద్య రంగంలో ప్రపంచంలోని ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి మద్దతు తెలిపి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీగా పోటీ చేస్తున్న బడుగు బలహీన వర్గాల నేత అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపీగా ఓటీసి గెలిపిస్తే వారికి పులిసెల్ల పూర్తి చేసుకుని, పల్నాడు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మే 13న ఎన్నికల జరుగుతాయని జూన్ 4వ తేదీన సాయంత్రానికి ఘోర ఓటమితో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు హైదరాబాదుకు వెళతారని జోస్యం చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ముస్లిం మైనారిటీలకు ఆత్మబంధువుగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కూటమికి అధికారం ఇస్తే సంక్షేమ పథకాల కి ముగింపు పలికినట్లేనని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మరో మారు ముఖ్యమంత్రిని చేసేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే బొల్లా కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.