MLA Raj Thakur’s son visited Prateek Thakur who was ill with dengue fever and was being treated
ఐటీ శాఖ మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కుమారుడు ప్రతీక్ ఠాకూర్ ని ఐటి శాఖ మంత్రివర్యులు,మంథని శాసనసభ్యులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు పరమర్శించి అనంతరం మాట్లాడుతూ డివిజన్ లో,గ్రామాల్లో గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా రోగాలు దూరమవుతాయని తెలిపారు. ప్రజలు డాక్టర్ల సూచనలు పాటించాలని, ఇంటి పరిసరాలలో వృధా, వర్షం నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పించారు.
పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పంచాయితీ అధికారులు పారిశుధ్యం, తాగునీటి క్లోరినేషన్ పై దృష్టిసారించాలని ఆదేశించారు. వ్యాధులు సోకినట్లు అనుమానితులుంటే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App