TRINETHRAM NEWS

డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్

వర్షాకాలం సమస్యలను అధిగమిస్తాం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ గోదావరిఖని సప్తగిరి కాలనీ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఇంచార్జీ కమిషనర్ &అదనపు కలెక్టర్ అరుణ తో కలిసి శంకుస్థాపన చేశారు

సప్తగిరి కాలనీలో కోటి 20 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు అదేవిధంగా ఒక కోటి 30 లక్షలతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో తీవ్రమైన వానలు వస్తే ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడేవారని అన్నారు

అయితే ఈ మారు అలాంటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డివిజన్ లో కనీస సదుపాయాలు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను ఈమారు అధిగమిస్తామని ప్రజలకు ధైర్యం చెప్పారు అక్కడి ప్రజలను ఆత్మీయంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలు, సలహాలతో ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు

కోట్లాది రూపాయల నిధులు తెప్పించి ఈ ప్రాంతాన్ని సుందరీకరణగా చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App