
ఎరువుల కొరత గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారులతో సమీక్ష
త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, 31/12/2024
నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు ఎరువుల కొరత ఎదుర్కోకూడదు – ఎమ్మెల్యే నల్లమిల్లి
దాళ్వా పంట నిమిత్తం ఎరువుల సరఫరా విషయంపై రామవరంలో అనపర్తి మండల 5 సొసైటీల సెక్రటరీలతోను చర్చించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
మండలంలో రైతులు యూరియా మరియు డి ఏ పి సరఫరా గురించి ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా నల్లమిల్లి సొసైటీ సెక్రటరీలకు తెలియజేసారు.
సెక్రటరీలు ఎరువుల సరఫరా విషయంలో భాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంపై ఎమ్మెల్యే నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. స్టాకు వివరాలు, దిగుమతి చేసుకున్న ఎరువుల వివరాలు, రైతులకు అందజేసిన ఎరువుల వివరాలపై సెక్రటరీలను నిలదీసారు. జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉండగా మీరు ఎందుకు తెప్పించుకోవడం లేదని వారిని ప్రశ్నించారు.
రైతుకు యూరియా గానీ, డి ఏ పి గానీ ఎన్ని బస్తాలు అవసరం అవుతుందో అతని ఎంత పొలం ఉందో తెలుసుకుని అంత మేరకు సరఫరా చేయవలసిందేనని ఏ ఒక్క రైతూ కూడా ఎరువుల కొరత ఎదుర్కోవడానికి వీల్లేదని అధికారులను నల్లమిల్లి హెచ్చరించారు.
జెడ్పి సమావేశంలో కూడా ఎరువుల కొరతపై తాను ప్రశ్నించిన విషయాన్ని సెక్రటరీలకు గుర్తుచేసిన నల్లమిల్లి, మీకు జిల్లాలో ఎరువుల లభ్యత సరిగా లేకుంటే నాకు తెలియజేయాలని ఆదేశించారు.
గత రాత్రి రైతులంతా నా దగ్గరకు వచ్చి సమస్య గురించి తెలియజేసారని బయట మార్కెట్ లో ఎరువుల బ్లాక్ చేసి ధర ఎక్కువగా ఉందని బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. బయట మార్కెట్ కి లాభం చేకూర్చే ఉద్దేశ్యంతోనే డిస్ట్రిబ్యూటర్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలసి ఇక్కడకు స్టాక్ రానీయడం లేదని, మీరు కూడా ఇండెంటు పెట్టడం లేదని నల్లమిల్లి దుయ్యబట్టారు,
జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు ఇండెంటు పెట్టడం లేదని, ఎరువులకి ఆర్ టీ జి స్ డబ్బు చెల్లించడం లేదని చెపుతున్నారు కాబట్టి మీరందరూ సమస్య ఎక్కడ ఉందో చర్చించుకుని నాకు తెలియజేస్తే పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాని నల్లమిల్లి సెక్రటరీలకు తెలియజేసారు.
ఈరోజు సాయంత్రానికల్లా ఎంత సరుకు డిమాండ్ ఉందో అంతా తెప్పించేలా ఏర్పాట్లు చేసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని నల్లమిల్లి ఆదేశించారు,
కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తూ వారి పంటలకు అవసరమైనంత ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగే రీతిలో అధికారులు వ్యవహరించొద్దని ఇది పాత ప్రభుత్వం కాదు అని గుర్తెరగాలని నల్లమిల్లి హెచ్చరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
