MLA Makkan Singh Raj Thakur- CPM District Committee of thanks
ఎస్.టి.పి.లో ఇల్లు కోల్పోయిన వారికి సెప్టెంబర్ మొదటి వారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన
ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్- కృతజ్ఞతలు తెలిపిన సిపిఎం జిల్లా కమిటీ.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కలిసి క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి,
ఏ.మహేశ్వరి మాట్లాడుతూ గోదావరిఖని గంగానగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం భూ పోరాటం చేసి ఇల్లు లేని నిరుపేదలకు సుమారు 350 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది పక్కా నిర్మాణాలు చేసుకుని నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో
ఎస్ టి పి నిర్మాణం కింద 126 లో తొలగించడం జరిగింది. వీరికి తప్పకుండా న్యాయం చేస్తామని స్వయంగా ఎమ్మెల్యే ఇండ్ల కూల్చివేతకు ముందు హామీ ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్యే అమెరికా నుండి వచ్చిన తరువాత ఈరోజు ఇండ్లు కోల్పోయిన వారందరినీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఇండ్లు కోల్పోయిన వారికి మరో చోట ఇంటి స్థలాలు ఇవ్వాలని,
మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.
అందుకు ఎమ్మెల్యే స్పందించి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సిపిఎం పార్టీ వేయించిన ఇండ్లలో కొన్ని ఇండ్లు తీసివేయాల్సి వస్తుందని,అందుకు సహకరించాలని సిపిఎం నాయకత్వాన్ని కోరడంతో వారు మంచి మనసుతో ఆలోచించి సహకరించినందుకు పార్టీ నాయకత్వానికి, పేదలకు ధన్యవాదాలు తెలిపారు. నా మాట మీద గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో మీరు అభివృద్ధి కోసం ఎలా సహకరించారో అదేవిధంగా నేను గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఇండ్లు కోల్పోయిన వారందరికి మరొక చోట ఇంటి స్థలాలు ఇస్తామని,మేమే స్థలాలను చదును చేసి లే అవుట్ లాగా చేసి ఇస్తామని,ఇంటి పట్టాలు ఇస్తామని,రోడ్లు,కరెంట్, మంచి నీళ్ళు మరియు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేదల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. అందుకు సిపిఎం పార్టీ నాయకత్వం బాధితుల పక్షాన,జిల్లా కమిటీ పక్షాన ఎమ్మెల్యే మొదటి నుండి చర్చల్లో పాల్గొని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి,
దీటి బాలరాజు, మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్,ఏసిపి రమేష్, డిసిపి రాజు, సిఐ ఇంద్రసేన రెడ్డి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగమణి,అనూష, భవాని, క్రాంతి, మహేందర్,నవీన్, బి.మహేశ్వరి,దీప, శ్రీనివాస్,శౌకత్అలీ, గణేష్,రాజయ్య,భాస్కర్ లతోపాటు సుమారు 200 మంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App