TRINETHRAM NEWS

పారిశ్రామిక వాడలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దూలపల్లి పారిశ్రామిక వాడకు చెందిన దూలపల్లి ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (దివ) సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి జీడిమెట్ల – దూలపల్లి పారిశ్రామికవాడ ప్రధాన రోడ్డు నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్లను నిర్మించాలని, అదేవిధంగా ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడిమెట్ల పారిశ్రామిక వాడ తర్వాత అతి పెద్దదైన దూలపల్లి పారిశ్రామికవాడ కు నిత్యం వేలాది వాహనాలు పరిశ్రమల్లో తయారుచేసిన ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వాడల అభివృద్ధిని విస్మరించిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జీడిమెట్ల – దూలపల్లి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లయితే పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు ఈ ప్రాంతం గుండా దూలపల్లి, కొంపల్లి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి సైతం ఉపయోగకరంగా ఉంటుంది.

అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ పరిశ్రమలను ప్రభుత్వాలు కేవలం పరిశ్రమల మాదిరిగా చూడకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కల్పతరువుగా, ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చే ఇంధనంగా భావించి పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల కాలంలో పారిశ్రామిక వాడలను వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు నూతన పారిశ్రామిక వాడలను నిర్మించి నాటి ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేశారు. ఇక దూలపల్లి పారిశ్రామిక వాడలోని రోడ్ల నిర్మాణంతో పాటు వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణం, మౌలిక వసతులైన త్రాగునీటి సౌకర్యం, పార్కుల అభివృద్ధికి తాను శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కోశాధికారి వెంకటేశ్వర్ రావు, సంక్షేమ సంఘం సభ్యులు ఇక్బాల్, శివ సుందర్, శశికాంత్, మేఘనాధ్ రెడ్డి, మూర్తి, శంకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App