పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడే ప్రజా ప్రతినిధులపై గౌరవం పెరుగుతుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
Trinethram News : Medchal : నిజాంపేట్ కార్పొరేషన్ లో మంచినీటి ఎద్దడి తగ్గించడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలతో కార్పొరేషన్ ను ఎంతో అభివృద్ధి చేసిన “విజనరీ నేత” ఎమ్మెల్యే : పాలకవర్గ సభ్యులు…
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ చివరి సర్వసభ్య సమావేశానికి కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మార్గదర్శకత్వంలో, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ మద్దతుతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి మోడ్రన్ కార్పొరేషన్ గా అభివృద్ధి పరచామని అన్నారు. పదవీకాలం అనేది తాత్కాలికమని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉన్నప్పుడే రాజకీయంగా వివిధ స్థాయిలో ఎదగగలమని అన్నారు. ప్రజా ప్రతినిధి అంటే పదవులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజాసేవకై పాటుపడాలన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు నుంచి కార్పొరేటర్లుగా పనిచేసి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న పాలకవర్గం సభ్యులకు నా శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో కూడా కార్పొరేషన్ అభివృద్ధికై అందరూ పనిచేయాలన్నారు.
అనంతరం నిజాంపేట్ కార్పొరేషన్ అభివృద్ధికై అహర్నిశలు కృషిచేసిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సేవల గురించి పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ మంచినీటి కొరతతో అల్లాడిన నిజాంపేట్ కార్పొరేషన్ కు కేసీఆర్ మానస పుత్రిక అయిన “మిషన్ భగీరథ” ద్వారా నీటి ఎద్దడిని తీర్చేందుకు ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికీ మరువలేమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక విజన్ తో పనిచేసే విజనరీ నాయకులు, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అని అన్నారు. ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇక్కడి నుంచి కూకట్ పల్లి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది, కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైకుంఠధామాల నిర్మాణంతో ప్రజల కష్టాలను తీర్చిన గొప్ప నాయకులు ఎమ్మెల్యే గారన్నారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ సాబేర్ అలి, మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App