
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. చండ్రుగొండ మండలకేంద్రం అంబేద్కర్ నగర్ (SC కాలనీ)లో త్రాగునీరు సరిపడక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్న విషయం మండల నాయకుల ద్వారా సమస్యను తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెంటనే స్పందించి ఇందిర జలబాట పథకం ద్వారా బోర్ మంజూరు చేసి ఈరోజు వారి చేతులమీదుగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఏ చిన్న గ్రామానికి మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంకా ఎక్కడైనా నీటి సమస్య ఉన్నట్లయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా సమస్యను తనదృష్టికి తీసుకురావాలన్నారు. ఈ వేసవి కాలంలో ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో RWS Ae యం. సాయికృష్ణ, పలు శాఖల అధికారులు మండల అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి,ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
