
29.03.2025 – శనివారం త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గం
అశ్వారావుపేట మండల కేంద్రం లో గాల.కోనేటి బజారులో ఉన్న జామియా మస్జీద్ మరియు మామిళ్ళవారి గూడెం, స్థానికంగా ఉన్న మస్జీద్ లలో రాష్ట్ర పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన, ఇఫ్తార్ వేడుకలకు ముఖ్య అతిధి గా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. పాల్గొన్నారు, ముందుగా అశ్వారావుపేట నియోజకవర్గంలో, ఉన్న ముస్లిం సోదరులకు, పవిత్ర రంజాన్ సందర్భంగా. ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు, అనంతరం ఇఫ్తార్ వేడుకలను ఉద్దేశించి.
మాట్లాడుతూ ఈ వేడుకలలో పాల్గొనడం, చాలా శుభ పరిణామంగా భావిస్తున్నానని ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో సహనంతో ఉపవాస దీక్షలు చేయడం ద్వారా కష్టాలలో ఉన్నవారి ఆకలి బాధలు అర్ధం చేసుకొని సాటి మనిషికి సహాయం చేయాలనే గొప్ప సంకల్పం ఆ అల్లా ప్రతి ఒక్కరికీ ప్రసాదిస్తారన్నారు ఈ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని ముస్లిం సోదరులకు సూచించారు సోదర భావనతో మతసామరస్యం పెంపొందించుకుంటూ మనమంతా, ఐక్యంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా. తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఓ కృష్ణ ప్రసాద్ ఎం.పి.డి.ఓ ప్రవీణ్, కుమార్ గారు ఆర్.ఐ కృష్ణ ,కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
