పెద్దంపేట్ గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దంపేట్ గ్రామంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం గ్రామస్థుల ఉత్సాహభరిత హాజరుతో అత్యంత వైభవంగా జరిగింది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “పెద్దంపేట్ వంటి గ్రామ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన ఇంధన వనరులు అందుబాటులోకి రావడం ఎంతో గర్వకారణం. రైతులు, యువత, మహిళలు, వ్యాపారవేత్తలు వంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ పెట్రోల్ బంక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఇంధన పంపిణీ కేంద్రం కాదు, గ్రామ అభివృద్ధికి తొలిపడుగులు వేసే కేంద్రమవుతుంది” అని తెలిపారు
ఈ సందర్భంగా పెద్దంపేట్ గ్రామస్థులు ఎమ్మెల్యే గ ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని తీసుకురావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు
ప్రముఖులు మాట్లాడుతూ, “ఇది గ్రామాభివృద్ధికి ఒక మైలురాయి. ఇంధన సౌకర్యంతో పాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు కూడా కలుగనున్నాయి” అని వ్యాఖ్యానించారుఈ కార్యక్రమంలో అంతర్గాం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధిత నాయకులు ప్రజలు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


