
పేదవారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ…
నిస్వార్ధమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ…
Trinethram News : పేదవారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిస్వార్ధమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.శనివారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ నందుగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఎం.పీ.పీ వెలుగుబంటి సత్య ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి యర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి హాజరయ్యారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల అన్న నందమూరి తారక రామారావు కి ఘన నివాళులు అర్పించి రూరల్ నియోజకవర్గం లోని బడుగు బలహీన వర్గాలకు చెందిన 32 మంది కార్యకర్తలకు ఒకరికి 10 వేల రూపాయలు చొప్పున 32 మందికి 3,20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అప్పటివరకు మదరాసీలుగా పిలవబడే తెలుగువారికి గుర్తింపు , గౌరవం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో వచ్చాయని, తెలుగుదేశం పార్టీ పెట్టిన వేళా విశేషం చాలా గొప్పదని, అందుకే తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందని ఆయన అన్నారు. 1982 మార్చి 29న ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 43వసంతాలు పూర్తిచేసుకుని 44వ ఆవిర్భావ వేడుక జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకమని అన్నారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి 9నెలల్లోనే అధికారంలోకి తెచ్చారని గుర్తుచేసారు.
బలహీన వర్గాలకు పక్కా గృహాలు, పెన్షన్లు, జనతా వస్త్రాలు, కిలో రెండు రూపాయలకే బియ్యం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టారని గోరంట్ల చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని గోరంట్ల అన్నారు. కోటిమంది సభ్యులతో, మంత్రి లోకేష్ సారధ్యంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఉందని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినప్పటికీ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని, ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకరిస్తున్నారని, అందుకే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని గోరంట్ల చెప్పారు.
అలాగే రాజమండ్రి రూరల్ మండలం, రాజమండ్రి సిటీలోని వార్డుల్లో కార్యకర్తలకు కూడా సాయం అందించనున్నట్లు గోరంట్ల వివరించారు. ప్రభుత్వ పథకాల్లో కూడా కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పించి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి శివ సత్య ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నూర్ బాషా సంఘ నాయకుడు షేక్ సుభాన్, మార్ని వాసుదేవ్, నిమ్మలపూడి గోవింద్, నున్న కృష్ణ, కురుకూరు కిషోర్, చెల్లుబోయిన శ్రీనివాస్, శీలం గోవింద్, పండూరి అప్పారావు, పల్లి సాయి, గంగిని నాని, యార్లగడ్డ శేఖర్, పిల్ల తనుజ, దండమూడి ప్రమీల, మద్దా మణి, కొయ్యన కుమారి, ముత్తాబత్తుల విజయ, బొప్పన నానాజీ, పితాని శివరామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్ట శ్రీను, దారా అన్నవరం, ఆళ్ల ఆనందరావు, ఉండవెల్లి బంగారు రాజు, భీమరశెట్టి రమేష్, ముమ్మిడి దేవీ నాగేశ్వరరావు, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, ఐ.టి.డి.పి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
