Ministers Nara Lokesh and Nimmala Ramanaidu inspected the construction of Budameru Gandi
Trinethram News : బుడమేరు : మొదటి గండిని పూడ్చిన అధికారులు.
మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి, వాటి తీవ్రత, ఎప్పటి లోగా గండ్లు పూడ్చగలం అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రులు లోకేష్, రామానాయుడు.
గత ఐదేళ్లలో కనీస మరమ్మత్తుల పనులు కూడా చెయ్యకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని మంత్రులకు వివరించిన అధికారులు.
మరింత వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో చర్చించిన మంత్రులు.
సమాంతరంగా అన్ని గండ్లు ఉన్న చోట్లా పనులు నిర్వహించాలని అందుకు అవసరమైన మార్గాన్ని వేగవంతంగా పూర్తి చెయ్యాలని ఆదేశించిన నారా లోకేష్.
అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు.
గంట గంటకు తాను నేరుగా సమీక్ష చేస్తానని ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను కోరిన నారా లోకేష్.
డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తానని అధికారులకు చెప్పిన నారా లోకేష్.
గండ్లు పూడ్చి పెట్టే పనులు పూర్తి అయ్యే వరకూ క్షేత్ర స్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించనున్న మంత్రి రామానాయుడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App