TRINETHRAM NEWS

గుండ్రాజు కుప్పం ఆదిఆంధ్రవాడలో త్రాగు నీటి పథకాన్ని ప్రారంబించిన మంత్రి ఆర్.కె.రోజా

దశాబ్దాల సమస్యకు యుద్ధప్రతిపదికన పరిష్కారం

రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం సచివాలయం పరిధిలోని గుండ్రాజు కుప్పం ఆది ఆంధ్రవాడలో నిర్మించిన త్రాగునీటి పథకాన్ని శనివారం ప్రారంబించారు.

గుండ్రాజు కుప్పం ఆది ఆంధ్రవాడలో ఎన్నో (30 సంవత్సర) దశాబ్దాలుగా అపరిష్కృతంగా దాదాపుగా 75 కుటుంబాలకు వున్న త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం
జల జీవన్ మిషన్ నిధుల ద్వారా
రూ.6.00 లక్షల రూపాయలతో త్రాగు నీటి మోటర్, పైప్ లైన్ ను మంత్రిగారు మంజూరు చేయించారు.

ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పటికి గుండ్రాజు కుప్పం ఆది ఆంధ్రవాడలో కనీసం త్రాగు నీటిని కూడా అందించక పోవడంతో ప్రజలు మంత్రి ఆర్.కె రోజా గారికి మోరపెట్టుకున్నారు.

దీనిపై స్పందించిన మంత్రి రోజా గారు యుద్ధప్రతిపదికన నిధులు మంజూరు చేయించి, తాగు నీటిని శనివారం ప్రజలకు అందించారు. తాగునీటి మోటార్, పైప్ లైన్ లను స్విచ్ ఆన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గారికి గుండ్రాజు కుప్పం ఆది ఆంధ్రవాడలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమకు మంచి నీరు అందించిన మంత్రి గారికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో నగరి రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.