
తేదీ : 04/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరిలో రెండవ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి ప్రజల కోసం 26 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91 వేల ఓట్లు మెజార్టీతో గెలిపించారని, ఇళ్ల పట్టాలు ప్రజలకు రెండు దశాబ్దాల కల కూటమితోనే ఆ కల నెరవేరింది అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
