
రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్ షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడులు, ఘర్షణలను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు. తొండపికి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లింటే బాగుండేదన్నారు. అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి అంబటి. సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
