
ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి మినీ రిజర్వాయర్లు నిర్మించాలని వాటికి నిధులను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్, టిడిపి అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్ను దొర కోరారు. అమరావతిలోని నారా చంద్రబాబునాయుడు ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అరకు నియోజవర్గ సమస్యలపై విన్నవించారు. ముఖ్యంగా అరకు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు. అరకు టౌన్షిప్ పరిధిలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రణజిల్లేడు వద్ద రిజర్వాయర్ నిర్మించాలని వందలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న దాన్ని వడిసిపట్టి సాగు, తాగునీటి కోసం మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందిస్తే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు నాయుడు కి వివరించారు. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ వద్ద నీరు నిత్యం వృధాగా పోతుందని అక్కడ మినీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం ద్వారా సుమారుగా 1000 ఎకరాలకు పైబడి రైతులకు సాగునీరు అందించొచ్చనని ఆయన చంద్రబాబు కు వివరించారు. అంతేకాకుండా మినీ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా ఎంతో కాలంగా అరకు టౌన్షిప్ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన డిపిఆర్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు.
చిట్టెంగొంది మినీ రిజర్వాయర్ అరకు వేలి మండలం మాదల పంచాయతీ చిట్టెంగొంది వద్ద మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే వేలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు అన్న విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కి దొన్ను దొర * వివరించారు. అక్కడ రిజర్వాయర్ నిర్మాణంతో మూడు పంటలు పండేందుకు అవకాశం ఉంటుందని దీంతోపాటు నందివలస, దుమ్మగుడ్డి, బట్టివలస, మజ్జి వలస, బొండ్రి గూడ, ముసిడి గూడ తదితర గ్రామాలకు సాగు, తాగునీరు తోపాటు మరో 700 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్న విషయంపై చంద్రబాబు నాయుడు కి వివరించారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరం నుంచే మూడు పంటలు పండేందుకు అవకాశం ఉంటుందని సియ్యారి దొన్ను దొర చంద్రబాబు కి వివరించారు.
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మినీ రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరిన అక్కడికక్కడే అధికారులకు ఫోన్లో రిజర్వాయర్ల నిర్మాణానికి డిపిఆర్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కి దొన్ను దొర ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ని కలిసిన వారిలో పెదబయలు మాజీ ఎంపీపీ వెచ్చంగి కొండయ్య , పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు , పద్మపురం మాజీ సర్పంచ్ మహదేవ్ , సీనియర్ నాయకులు చిన్ని , వెంకటరావు తదితరుల ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
