
డిండి గుండ్ల పల్లి త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా డిండి పోలీస్ స్టేషన్లో శనివారం నాడు మీట్ యువర్ ఎస్పి, కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎస్పీ శరత్ పవర్ ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.
డిపిఓ నుంచి శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా డిండి పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటలకు మీట్ యువర్ ఎస్పి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని చెప్పారు.
పోలీస్ స్టేషన్ లో నే బాధితుల ఫిర్యాదులను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
డిండి మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వివరించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
