
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, తహసిల్దార్ కార్యాలయంలో, డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
తహసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ అంటరానితనం , సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆయన అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్య్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందo, జూనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్, శివాజీ,అజయ్, వెంకటయ్య, సుధాకర్, ముడి లింగం, రామస్వామి, పీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
