రూరల్ సర్కిల్ సిఐ గా మల్లికార్జునరావు బాధ్యతలు.

TRINETHRAM NEWS

రూరల్ సర్కిల్ సిఐ గా మల్లికార్జునరావు బాధ్యతలు.

Trinethram News రేపల్లె రూరల్ సర్కిల్ స్టేషన్ సీఐ మల్లికార్జునరావు  సీఐ . ఏ.మల్లికార్జునరావు బుదవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటిసాధారణ బదిలీ లో భాగంగా రేపల్లె వచ్చారు. స్టేషన్స్ సిబ్బంది పుష్పగుచ్చనిచ్చి స్వాగతం  పలికారు. ఈ సందర్భంగా సీఐ ఏ.మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రత కల్పించడంలో అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అ క్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వహిస్తు లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పరిరక్షిస్తానని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top