
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, (అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : 23న రంపచోడవరంలో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చెయ్యండి: ఆదివాసీ జెఏసి
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి వార్షిక ఉద్యమ కార్యాచరణ పై, మార్చి 23 న రంపచోడవరం లో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి గౌరవ సలహాదార్లు కొండగొర్రి ధర్మరావు, అరిక నీలకంఠం,రాష్ట్ర వైస్ చైర్మన్లు మొట్టడం రాజబాబు,మొడియం శ్రీనివాస్ రావు,తెల్లం శేఖర్,బంగారు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి,ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ రామరావుదొర,రంపచోడవరం డివిజన్ కన్వీనర్ పి. కామరాజు జెఏసి కేంద్ర కమిటీ సభ్యుడు మడావి నెహ్రూ,రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కంగాలి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రోజురోజు ఏజెన్సీ ప్రాంతంలో చాపకింద నీరుల గిరిజనేతరల వలసలు పెరుగుతూ ఆదివాసీ సమాజన్ని అణచివేస్తున్నారని, షెడ్యూల్డ్ ప్రాంత సంపదను అక్రమంగా దోచుకుంటూ,పక్కలో బల్లెంలా ఉంటూ ఆదివాసీ చట్టాలను ఆదివాసీ ప్రజా ప్రతినిధులతోనే తొలగించే విధంగా కుట్ర చేస్తున్నారని, ఈ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి కమిటీలను బలోపేతం చేసుకుంటూ,షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం, గిరిజన సలహా మండలి (టీఎంసీల) ఏర్పాటు, టిఏసి భవన్ నిర్మాణం, భూబదాలయింపు నిషేధచట్టం పటిష్టంగా అమలు చేయాలని,ప్రత్యేక ఉప కలెక్టర్ (గిరిజన సంక్షేమం) కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి వారితో పని చేయించాలని.
పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించినప్పుడే వారిని తరలించాలని,భూ సేకరణలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిషన్ వేయాలని, పీసా భవనాలు నిర్మించి,నిధులు కేటాయించాలని ఇలా పలు డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి రాష్ట్ర కమిటీతో పాటు శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం , అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాల కమిటీ సభ్యులు, మరియు రంపచోడవరం డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
