TRINETHRAM NEWS

మన్యం బంద్ విజయవంతం చేయండి
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర.

అల్లూరి జిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 11: నేడు 11,12 రెండు రోజుల, జరిగే రాష్ట్ర మన్యం బంద్ ను జయప్రదం చేయంలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకు వేలి డిగ్రీ కాలేజీ నుండి అరకు జైపూర్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ ప్రచారం నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర జిల్లా కార్యదర్సులు కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పి.

బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం ఉండడం వలన టూరిజం అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆదివాసులకు ఆర్థిక స్తొమత లేక పెట్టు బడి పెట్ట లేక పోతున్నారని ఆదివాసీ ప్రాంతంలో ఉన్న 1/70చట్టం సవరణ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు అంతే కాకుండా ఆదివాసులకు చులకన భావంతో అవహేళన చేస్తూ మాట్లాడడం ఆదివాసీ సమాజానికి ద్రోహం చేయడమేనని ఆదివాసీ హక్కులు చట్టాలు కాలరాసి ప్రైవేట్ వ్యక్తులకు ఆదివాసీ భూములు కట్టబెట్టడానికేనని శాసన సభ స్పీకర్ పరకటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని ఆదివాసీ ప్రాంతంలో ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేసి గిరిజన ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదివాసీలకు 100% రిజర్వేషన్ చట్టం చేయాలని ప్రత్యేక గిరిజన డిఎస్సి తీసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టలను తొలగించడానికి పునుకోవడం దుర్మార్గం దీనికి ఆదివాసీ ప్రజాసంఘాలు అడ్డుకొంటాని ప్రభుత్వనికి వ్యతిరేకంగ నేడు 11,12 తేదీల్లో జరిగే రాష్ట్ర మన్యం బంద్ కు అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి డి. ఆనంద్, కాంగ్రెస్ నాయకులు పి.చిన్న స్వామి, సిపిఎం మండల కార్యదర్శి కె. రామారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి. ఉమామహేశ్వర రావు, డిఎల్ఓ జిల్లా అధ్యక్షులు కె ప్రసన్న కుమార్, ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షులు చట్టు మోహన్ రావు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు, మండల నాయకులు కె జగన్నాధం, కె. బుజ్జి బాబు, పి. నాని బాబు, కె మగ్గన్న, సహాదేవ్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make Manyam Bandh successful