
Trinethram News : AP: శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సత్రాల నిర్వాహకులు, భక్తులు సహాకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు దిగిన చోట నుంచి ఆయా కూడళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు.
