TRINETHRAM NEWS

మంత్రిపై సర్పంచ్ హత్యా ఆరోపణ.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ హత్యారోపణల నేపధ్యంలో సీఎం ఫడ్నవీస్‌ మంత్రివర్గంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో పౌర సరఫరాల శాఖ మంత్రి ధనుంజయ్ ముండే సన్నిహితుడు అరెస్టు కావడంతో కలకలం రేగింది.
ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మీక్ కడార్ అరెస్టు కావడంతో సీఎం దేవేంద్ర ఫడణవీస్ సూచన మేరకు ధనుంజయ్ రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాను ఆమోదించినట్టు సీఎం తెలిపారు.

బీడ్‌ సర్సంచ్‌ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ తొమ్మిదిన కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌ ముండే సహాయకుడు వాల్మిక్‌ కరాడ్‌ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితుడిని మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండాలే కలవడం చర్చకు దారితీసింది.
ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది. దీంతో మంత్రి ధనంజయ్‌ ముండేపై ప్రతిపక్షాలతో పాటు పలువురు కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తులో పారద్శకత కొరవడిందని, మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్‌ మంత్రి ధనంజయ్‌ను రాజీనామా చేయమని కోరినట్లు తెలుస్తోంది. సీఎం సూచన మేరకు ధనంజయ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ధనుంజయ్ ముండే రాజీనామాకు ముందు సీఎం ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో ఈ విషయంపై సమావేశమైనట్టు తెలుస్తోంది. మంత్రి ధనుంజయ్ ముండే అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత కావడంతో ఈ పరిణామం తాలూకు రాజకీయ ప్రభావాలపై చర్చించినట్టు సమాచారం. ధనంజయ ముండే భీడ్ జిల్లాలోని పార్లీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేకు ఈయన బంధువు. 2013లో ఎన్సీపీలో చేరి, 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయినప్పుడు అజిత్ పవార్ వెంట నడిచారు.
గతంలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ధనుంజయ్ ముండే మంత్రిగా పనిచేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dhananjay Munde Resigns