త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జాతీయ అవార్డు రావడానికి సహకరించిన రామగుండం నియోజకవర్గ ప్రజలందరికి పేరు పేరున కృతజ్ఞతలు. మద్దెల దినేష్
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మరియు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినెష్ కు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో “ఉత్తమ సేవా సంఘం జాతీయ అవార్డు-2024” ను ఆదివారం తిరుపతిలో జరిగిన 8వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణా మరియు సినీ డైరెక్టర్, మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ పోలీస్ ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాల్లోని ప్రముఖులు ముఖ్య అతిథులు ఇట్టి జాతీయ అవార్డు ను అందజేశారు.
ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ ఇట్టి అవార్డు వల్ల నాపై సమాజానికి సేవ చేయడం కోసం మరింత బాధ్యత పెరిగిందని, సమాజానికి మా వంతుగా చేసిన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ, జాతీయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
సమాజంలో జరగుతున్న అవినీతి అక్రమాలు, మరియు ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడుతామని, అదే విధంగా నిరుపేదలు, నిరాశ్రయులు, అనాధలు, అభాగ్యులకు, అన్నార్థులకు అండగా ఉంటామని మా వంతు సహాయ కార్యక్రమాలు అందిస్తామని పేర్కొన్నారు.
జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని, దీనికి సహకరించిన రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని దినేష్ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App