
Trinethram News : బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ గారు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ గారికి కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపడం జరిగింది. మూగ, చెవిటి సమస్యల నుంచి విముక్తి పొందుతున్న పిల్లలను చూసి డా.అంజిరెడ్డి హాస్పిటల్ వారి వైద్య సేవలను కొనియాడారు.
