వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పర్యావరణాన్ని కాపాడదాం వికారాబాద… మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రామ్ మందిరం దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి మంజుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజుల రమేష్ మాట్లాడుతూ. పూర్వం మన పెద్దలు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలనే పూజించవరని గుర్తు చేశారు. కానీ ఈమధ్య కెమికల్స్ తో తయారు చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయడం కారణంగా జల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. కావున వికారాబాద్ పట్టణ ప్రజలు బాధ్యతగా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలే లక్ష్మణ్ గుప్తా, కార్యదర్శి యాష్కి సునీల్, వైస్ ప్రెసిడెంట్ రఘునందన్, కోశాధికారి దోమ శ్రీకాంత్, అదనపు కార్యదర్శి మ్యాడమ్ వేణుగోపాల్, మహిళా సంఘం అధ్యక్షురాలు మ్యాడమ్ లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, పెండ్యాల రవికుమార్, చింతలూరు శ్రీనివాస్, సతీష్, విక్రమ్, బాదం సందీప్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


