
వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
Trinethram News : రాజానగరం : అడవిని అక్షరాన్ని కలిపి నాటానని, అడవిలో అక్షర సేద్యం చేస్తూ వచ్చానని, వాటి వృద్ధిని చూసానని ఇటువంటి స్థిరమైన వృద్దే సుస్థిరాభివృద్ధి అని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిపార్టమెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రెండు రోజుల నేషనల్ సెమినార్ ను నిర్వహించారు. “పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరాభివృద్ధిపై ఎకోప్రెన్యూర్‌షిప్ ప్రభావం” అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి సెమినార్ ను ప్రాంరంభించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు సహజ వనరుల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా 1960లు మరియు 1970లలో ఆధునిక పర్యావరణ ఉద్యమం ఊపందుకుందన్నారు. పర్యావరణవాదం యొక్క మొదటి తరంగం మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవశ్యకతను రేకెత్తించిందని, పర్యావరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా స్థిరమైన పద్ధతులకు దారితీసే గ్రీన్ వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి సారించే ఎకోప్రెన్యూర్‌లు – వ్యవస్థాపకుల ఆవిర్భావానికి పునాది పడిందన్నారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటమే కాకుండా పునరుత్పాదక శక్తిని స్వీకరించడం, వ్యర్థాలను తగ్గించడం మరియు పర్యావరణ అనుకూల పదార్థాలను వారి ప్రక్రియలలో సమగ్రపరచడం ద్వారా పర్యావరణానికి సానుకూలంగా దోహదపడతాయని గ్రహించారన్నారు.
అభివృద్ధి పేరుతో పర్యావణానికి హాని చేకూర్చకూడదని, పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు. విశ్రాంత ఆచార్యులు పి.సుబ్బారావు మాట్లాడుతూ ఎకోప్రెన్యూర్‌షిప్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ మధ్య వ్యత్యాసాలను తెలియజేశారు. నేడు వేగంగా ముందుకు సాగుతున్న కాలంలో పర్యావరణ పరిరక్షణకు ఎకోప్రెన్యూర్‌షిప్ ప్రధాన శక్తిగా పరిణామం చెందిందని అన్నారు. ఎకోప్రెన్యూర్‌లు ముందుచూపుతో కూడిన విధానాలతో, మనం ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను – పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత మరియు ప్లాస్టిక్ కాలుష్యం పరిష్కారమవుతాయని అన్నారు. శక్తి, వ్యవసాయం, నిర్మాణం మరియు రవాణా వంటి పరిశ్రమల భవిష్యత్తును రూపొందించడంలో ఎకోప్రెన్యూర్‌షిప్ లు కీలక పాత్రను పోషిస్తున్నారని చెప్పారు.
వర్ధమాన పారిశ్రామికవేత్త సౌజన్య మాట్లాడుతూ పర్యావణహితమైన వ్యాపారాలు, పరిశ్రమలు ఉండాలని అప్పుడే భావి తరాలకు చక్కని పర్యావరణం అవుతుందన్నారు. తరువాత వర్ధమాన పారిశ్రామికవేత్తలు సౌజన్య, ఎ.బిందు, కె.లావణ్య, పి.నిరీష లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సెమినార్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొడక్ట్స్ స్టాల్స్ ను వీసీ సందర్శించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం సెమినార్ కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ ఆచార్య పి.ఉమమహేశ్వరిదేవి, ఆచార్య ఎన్.ఉదయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
