
అల్లూరిజిల్లా అరకు లోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్, రిపోర్టర్ ఫిబ్రవరి 17: ఈ నెల 27 తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ బలపర్చిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలి శరభగుడ, జెడ్పీకాలనీ, రెంటల్ కాలనీ ,కంఠబౌన్సుగూడ పరిధిలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు కిల్లో జగన్నాథం కొర్రా మగ్గన్న తాంగుల హరి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యలు ఆదివాసుల సమస్యలపై మాట్లాడే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యలపై విద్యారంగంపై అపోరాటాలు చేసి అగ్రభాగంలో నిలచారు విద్యా రంగంపై అవిరళ కృషిచేశారు అనేక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించారు ఆదివాసులతో మమేకమై సమస్యలపై పోరాడిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని ఈ నెల 27 తేదీన జరగనున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిపిఎస్ రద్దు చేయాలని కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్, జూనియర్, డిగ్రీ లెక్చరర్స్ రెగ్యులర్ చేయాలని ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ నియామక చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ పోరాటంలో పాల్గొన్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
