TRINETHRAM NEWS

Let’s move together to abolish labour codes

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడదాం

IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లాల IFTU ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అత్యంత నివాంక సంఘాల కార్మిక చట్టాలను కాలరాస్తున్నది. నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన లేబర్ కోడ్లను బలవంతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును అందులో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్మును ప్రైవేటు వారికి అప్పగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

సంక్షేమ బోర్డును ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతున్నది. 2017 నుంచి వేతనాల సవరణ లేక కాంట్రాక్టు కార్మికులంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కనీస వేతనాలను ఇంతవరకు సవరించలేదు. కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలను త్రిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. బలమైన ఐక్య ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పుకొట్టగలుగుతాం. డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరిగే బ్లాక్ డేను కార్మిక వర్గం ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, ఆడెపు శంకర్ మార్త రాములు, ఇనుగాల రాజేశ్వర్, కలవల రాయమల్లు, భీమయ్య, తూళ్ళ శంకర్ గొల్లపల్లి చంద్రయ్య, గుమ్మడి వెంకన్న, కమలాకర్ ,లింగయ్య , సదానందం, లక్ష్మణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App