
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. సోమవారం కూకట్పల్లి గ్రామంలోని దయారగూడ ప్రాంతంలో దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం సలహాదారులు పాండు, గిరిబాబు, పోతరాజు యాదగిరి, అధ్యక్షులు శంకర్, జర్నలిస్టులు నగేష్, అంజిబాబు, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
