ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ మృతి: నేడు అంత్యక్రియలు

TRINETHRAM NEWS

ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ మృతి: నేడు అంత్యక్రియలు

కర్ణాటక:డిసెంబర్ 27
ప్రముఖ పైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.

బెంగళూరులోని తన ఇంట్లో ఆయన నిద్రలోనే గుండె పోటుతో మరణించారు. జాలీ దాదాపు 900 చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు.

ఆయన ఎక్కువగా కన్నడ సినిమాలకు పనిచేశారు. చిరంజీవి నటించిన అన్నయ్య మూవీకి జాలీ బాస్టియనే ఫైట్ ను కంపోజ్ చేశారు. దీంతో తెలుగు పరిశ్రమకు కూడా పరిచయం అయ్యారు

రిస్క్ తో కూడుకున్న ఫైట్స్ కంపోజ్ చేయడంలో జాలీ బాస్టియన్ కు ఎంతో పేరు సంపాదించాడు.కన్నడ సీమలో ఆయనను రియల్ హీరో అని పిలిచేవారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు..

You cannot copy content of this page

Scroll to Top