ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు
ముత్తారం త్రినేత్రం న్యూస్ ఆర్.సి
ముత్తారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజున ముత్తారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కు వినతిపత్రం అందిచారు.సీతంపేట,పోతారం,ఓడేడు,గ్రామాలలో ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారని.దీని పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని.తాసిల్దార్ కు అందించిన వినతిపత్రంలో సూచిసచారు.గత 10ఏళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములు గురించి చాలాసార్లు వినతిపత్రం అందించి ఆ భూములను కాపాడాం.కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వ భూములను కొంతమంది అధికారులా కనుసన్నల్లో కబ్జా చేసి ఆ భూములలో పంట సాగు చేస్తున్నారు.అయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఎమ్మార్వో కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముత్తారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోతుపెద్ది కిషన్ రెడ్డి. మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య.మాజీ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్రావు. మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజు రెడ్డి.కేశనపెల్లి మాజీ సర్పంచ్ నూనె కుమార్.ముత్తారం గ్రామం శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్.తిత్తుల శ్రీనివాస్.మల్యాల రాజయ్య.పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమం పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App