
తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తూము. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాచారం గ్రామం పడవ రేవు నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా , కూనవరం మండలం, గోమ్ముగూడెం గ్రామం ,లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఆలయానికి లాంచి మరియు పడవ సౌకర్యం కల్పించాలని, ఆలయానికి వెళ్ళుటకు అనుమతి ఇవ్వాలని మండల తాసిల్దారుకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు ముందుగానే స్థానిక యస్.
ఐ, ఎంపిడిఓ, జిల్లా కలెక్టర్, మరియు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ద్వితీయ సారి మండల తహసిల్దారు కు మెమోరాండం ఇచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు చూస్తున్నారు. మా పరిధిలో లేదని , ఎలాంటి మెమోరండం ఇవ్వలేదని, అధికారులు చెప్పడం వి డ్డూరం. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ , భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుంజా వెంకట నరసయ్య, వాడపల్లి. లక్ష్మణాచార్యులు, వేముల. శేషగిరి, బొల్లు .రాము, చేరుకుంట్ల. సతీష్, నరేష్, వెంకట బాలకృష్ణ, కె.బిక్ష చారి, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
