
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేటలో, సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్ల భూమి దుళ్ళా శ్రీనివాసరావు, దలే కావమ్మ అనే గిరిజనేతరులకు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి (1- బీ) 2025జనవరి 24 న కొయ్యూరు మండల రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది. ఆదివాసి అయిన మాదల తిరుపతయ్య పేరున ఉన్న భూమిని, నర్సీపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని,5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల భూములు 1917 ,1959 మధ్యలో గిరిజనేతరులు కొనుగోలు చేస్తే ఆ భూములకు జిల్లా కలెక్టర్ అనుమతులతో రిజిస్ట్రేషన్ చేయాలి.1959,1970ల తర్వాత గిరిజనేతరులు ఎటువంటి భూములు కొనుగోలు చెల్లవు.
ఆదివాసీ చట్టాలపై కనీస అవగాహన లేకుండా రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు పట్టాలు ఎలా ఇస్తారని, వెబ్ ల్యాండ్ లో ఎలా నమోదు చేస్తారు. తక్షణమే ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని,లేదంటే ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెవెన్యూ కార్యాలయంను ముట్టడి చేసి, భూబదాలయింపు నిషేధచట్టం ఉల్లంఘన కింద కోర్టు లో కేసు వేస్తామని, ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జెఎసి నాయకులు ఎస్ అశోక్ లాల్, పాడి లోవరాజు,ఉల్లి సూరిబాబు.నర్సికృష్ణ,కాకర చిన్నారావు,కాకర సోమి నాయుడు, కొర్రు బాబూరావు, వంజరి సంకురమ్మ ,బూరుగు వెంకటరావు తదితరులు మీడియాకు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
