
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : కూకట్పల్లి నియోజకవర్గం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ ప్రకటించింది. నూతన అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కోహీర్ నాగరాజు యాదవ్, కోశాధికారిగా సదా మహేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఏ.మారుతి సాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే దయాసాగర్ శనివారం అందజేశారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో రూపొందించుకొని కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని అల్లం నారాయణ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
