TRINETHRAM NEWS

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా.

మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు

వాట్సాప్ నెంబర్ కి హాయ్ హెల్ప్ అని మెసేజ్ పెట్టి సమాచారం పంపితే చాలు పోగొట్టుకున్న మీ మొబైల్ ని రికవరీ చేస్తామని హామీ ఇస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ వినియోగించుకొని పోలీసు వారి సేవలను పొందాలని తెలియజేసిన జిల్లా ఎస్పీ పి.జాషువా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసే నిమిత్తం జిల్లా ఎస్పీ జాషువా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐటీ కోర్ సిబ్బంది సిసిఎస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక “మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం” అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక అప్లికేషన్ను రూపొందించి మిస్సింగ్ మొబైల్‌ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగింది.

మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం అనే అప్లికేషన్ ద్వారా జనవరి 2023 నుంచి పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గూర్చి ఫిర్యాదులు స్వీకరించి సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి సుమారు *50 లక్షల రూపాయల విలువ చేసే 252 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది ఇప్పుడు రెండో పర్యాయం సుమారు 90 లక్షల విలువగల 421 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి ఇక దొరకదు పోగొట్టుకున్నా మనుకున్నా మొబైల్ ఫోన్లను సిసిఎస్ డిఎస్పి మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బంది ఐటి కోర్ సిబ్బంది సాయంతో రికవరీ చేసి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా భాదితులకు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేసి జిల్లా పోలీసు అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ మొబైల్ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం అనే అప్లికేషన్ను ప్రజలు అందరూ వినియోగించు కోవాలని ఫోన్ చోరీకి గురయినా, మిస్ అయిన వారు ఈ వాట్సాప్ నంబర్ 9490617573 HI లేదా HELP అని మెసేజ్ పంపి అడిగిన సమాచారం అందులో నిక్షిప్తపరచి పోలీసు వారి సేవలను పొందవచ్చని ఈ విధానము ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది దీనిని ప్రజలు సద్వినియోగం పరుచుకొని పోగొట్టుకున్న మొబైల్స్ ను తిరిగి పొందవచ్చు అలాగే ఆటకాయతనంగా ఆకతాయిలు ఈ అప్లికేషన్ను దుర్వినియోగ పరుచుకుంటే సహాయం పొందవలసిన వారికి సహాయం అందించలేమని కనుక ప్రజలంతా సహకరించాలని ఎస్పీ తెలిపారు ఎవరికైనా దొరికిన సెల్ ఫోన్ లను సొంతానికి వాడుకోవడం కాని మరియు గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కాని చేయకూడదు మీకు దొరికిన సెల్ ఫోన్ లను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి అందజేయాలని తెలియజేశారు దొంగతనం చేయలేదు కదా అని ఉపయోగిస్తే తద్వారా కేసులలో చిక్కుకోవాల్సి వస్తుందని తెలిపారు