గోదావరిఖని ఇతర త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని కష్టాన్ని నమ్ముకుని అంచలంచలుగా పైకి ఎదిగి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ వ్యాపార రంగంలో దుసుకపోతున్న యువకుడు, మంచికి మారుపేరు, సేవకు ప్రతిరూపం, నిరుపేదలకు నిరాశ్రాయులకు నిరంతరం సహాయం చేయడంతో పాటు వారికి అండగా ఉంటున్న వ్యాపారవేత్త కోట కుమార్ వాసుందర విజ్ఞానికా వికాస మండలి వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాల సేవలందిస్తున్న తరుణంలో కోట కుమార్ వ్యాపారంగ పరంగా అవార్డు ఇవ్వడం పట్ల పారిశ్రామిక ప్రాంతంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా కోట కుమార్ మాట్లాడుతూ వసుంధర విజ్ఞానిక వికాస మండలి సంస్థ సమాజంలో తమకంటూ ప్రత్యేక పేరు చాటుకున్నదని నేడు హైదరాబాదులో రవీంద్ర భారతిలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న విద్యా , వైద్య, వ్యాపార, సామాజిక రంగంలో మరియు ఇతర రంగాలలో సమాజానికి సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులు ప్రకటించడం శుభ పరిణామం అని ఇందులో భాగంగా వ్యాపార రంగం సంబంధించి నాకు అవార్డు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
వసుంధర విజ్ఞాన వికాస మండలకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేకే గ్రూప్ మరియు అక్షర గ్రూప్స్ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.
ఎవరు ఏ రంగంలో ఉన్న సమాజానికి మన వంతు సహాయం నిరంతరం కొనసాగించాలని ఎంతోమంది నిరుపేదలు నిరాశ్రయులు మనకు కంటికి కనపడుతూనే ఉంటారని కావున మన వంతు బాధ్యత సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు, అనాధలకు నిరాశ్రయులకు, అభాగ్యులకు అందరికీ సహాయం అందించే విధంగా ఉండాలని అన్నారు.
కేకే గ్రూప్స్ మరియు అక్షర గ్రూప్ నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడ మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. అనాధ పిల్లలకు చదువు, బట్టలు వారికి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా మరియు ఎవరైనా నిరుపేద ఆడపిల్లలు ఉన్న వారికి పెళ్లిళ్లు చేయడం, అదేవిధంగా దురదృష్టశాత్తు వల్ల ఎవరైనా నిరుపేదలు మృతి చెందితే వారికి అన్ని రకాల అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు మన వంతు సహకారాలు నిరంతరం కేకే గ్రూప్స్ & అక్షర గ్రూప్ సభ్యులు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు.
రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాసం మండలి ద్వారా వ్యాపార రంగంలో అవార్డు అందుకున్న కోట కుమార్ గోదావరిఖనిలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థి, యువజన, స్వచ్ఛంద సంస్థల, నిర్వాహకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App